గుఱ్ఱం జాషువా జయంతి నివేదిక 2026
గుఱ్ఱం జాషువా జయంతి నివేదిక 2026 తేది :28-09/2026 లక్ష్యాలు గుఱ్ఱం జాషువా గారి జీవితం మరియు సాహిత్య కృషి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం. జాషువా సాహిత్యంలో ప్రతిఫలించిన మానవతా విలువలను విద్యార్థులకు పరిచయం చేయడం. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం మరియు సోదరభావం పట్ల అవగాహన పెంపొందించడం. తెలుగు సాహిత్యం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడం. విద్యార్థుల్లో ప్రసంగ నైపుణ్యాలు మరియు భావవ్యక్తీకరణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం. సామాజిక సమస్యలపై విద్యార్థుల్లో చైతన్యం మరియు బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించడం. నివేదిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామవరపుకోటలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు గారి సూచనల మేరకు కళాశాల విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తెలుగు శాఖ ఆధ్వర్యంలో గుఱ్ఱం జాషువా జయంతిని పురస్కరించుకుని 28-09-2026న కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో జాషువా జయంతి వేడుకలు నిర్వహించబడ్డాయి. ఇంచార్జ్ ప్రిన్సిపల్ డా. ఎం. మధు గారు మరియు అధ్యాపక సిబ్బంది ముందుగా జాషువా గారి చిత్రపటానికి పూలమాల తో ఘన నివాళి అర్పించడం జరిగింది. తదుపరి ఇంచార్జ్ప్ ప్రిన్సిపల్ గారు జాషువా...