Telugu Language Day Celebrations 2025
నేడు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు గారి సూచనల మేరకు కళాశాల విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నేడు తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎం. మల్లేశ్వరావు గారు గిడుగు రామమూర్తి గారి చిత్ర పటానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు గారు వ్యవహారిక భాష యొక్క ఆవశ్యకత గురించి తెలియజేసారు. అనంతరం తెలుగు విభాగం అధ్యాపకుడు డాక్టర్ జి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ తెలుగు అనే పదంలో ఎంతో మాధుర్యం ఉంది అని తెలుపుతూ వ్యవహారిక భాష కొరకు గిడుగు రామ్మూర్తి గారు చేసిన సేవలను కొనియాడుతూ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరించారు. అనంతరం వివిధ సాంస్కృతిక పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు, ఐ.క్యూ.ఎ.సి కో ఆర్డినేటర్ డాక్టర్ జి శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎం ఉషారాణి, కె ఇందిరా కుమారి, ధారావతు మల్లేష్, బి.రాజు, పి ఏడుకొండలు, ఎం విజయ కృష్...