TELUGU LANGUAGE DAY REPORT

 

TELUGU LANGUAGE DAY REPORT

Name of the activity                   : Telugu Language Day

Department                                   : Telugu

Date                                                   : 29-08-2024

No. of Staff Participated           : 10

No. of Students Participated  :   70

Aim

To promote, preserve and celebrate the richness and diversity of Telugu language and culture.

Objectives

1. Language Promotion: Promote Telugu language and literature among younger generations.

2. Cultural Preservation: Preserve and showcase Telugu culture, traditions, and heritage.

3. Literary Awareness: Create awareness about renowned Telugu authors, poets, and their contributions.

4 Education: Educate people about the importance of mother tongue.

Outcomes

1. Increased language proficiency: Enhanced appreciation and fluency in Telugu among participants.

2. Cultural enrichment: Deeper understanding and appreciation of Telugu culture and tradition

3.Preservation of heritage: Documentation and preservation of Telugu folklore, proverbs, and idioms.

4. Inspiration: Motivation among youth to learn and promote Telugu language.

5. Intergenerational connection: Bridged gap between generations through shared cultural heritage.

తెలుగు భాషా దినోత్సవ నివేదిక

కార్యక్రమం : తెలుగు భాషా దినోత్సవం

తేదీ: 29-08-2025

స్థలం: కళాశాల సెమినార్ హాల్

సమయం: సాయంత్రం 3.00 గం.లకు

అధ్యక్షత: శ్రీ ఎం.మల్లేశ్వర రావు

        ఇంచార్జ్ ప్రిన్సిపాల్

నిర్వాహకులు: డా. జి. శ్రీనివాస రావు

 తెలుగు విభాగం అధ్యక్షులు

పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య : 70

పాల్గొన్న అధ్యాపక, అధ్యపకేతర సిబ్బంది సంఖ్య :10

 

తెలుగు భాషా దినోత్సవం యొక్క లక్ష్యం (Aim):

1.     తెలుగు భాషా గొప్పతనాన్ని గుర్తు చేయడం: ఈ దినోత్సవం ద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనం, సాహిత్య చరిత్ర, సంప్రదాయాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. తెలుగు సాహిత్యం ప్రోత్సహించడం, యువతలో, విద్యార్థుల్లో, భాష పట్ల చైతన్యం కలిగించడం.

 

తెలుగు భాషా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యం: (Objective)

 

1.     తెలుగు భాష పరిరక్షణ: భాషా సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయాలను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించడం.

2.     భాషా ప్రాధాన్యతను విస్తరించడం: తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజలకు భాషపై గౌరవం, మక్కువ కలిగించడం.

3.     యువతలో భాషా చైతన్యం కలిగించడం: తెలుగు భాషను సులభంగా నేర్చుకోవడం, రక్షించడం, భాషా సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా యువతలో భాషా చైతన్యం పెంపొందించడం.

4.     సాహిత్యాన్ని ప్రోత్సహించడం: తెలుగు సాహిత్య సృజనను, కవిత్వం, రచనలు, నాటకాలు వంటి కళలను ప్రోత్సహించడం.

5.      సామాజిక ఐక్యతకు ప్రోత్సాహం: భాష ద్వారా సమాజంలో ఐక్యతను, ఆత్మగౌరవాన్ని కలిగించడం.

 

        తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం తెలుగు భాషా గొప్పతనం, వైభవం, సాహిత్య చరిత్రను గుర్తు చేస్తూ, భవిష్యత్ తరాలకు భాష పట్ల మక్కువ పెంచేందుకు ప్రేరణ కలిగించే విధంగా ఈ కార్యక్రమం దోహదపడటం  జరిగింది.

        కార్యక్రమం ప్రారంభంలో ముందుగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం. మల్లేశ్వర రావు గారు మరియు అధ్యాపకులందరూ కలిసి గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం సభా ధ్యక్షులు తన ప్రసంగంలో తెలుగు భాషా ప్రాముఖ్యతను, గిడుగు పంతులు గారి సాహిత్య సేవలను వివరించారు.

      విద్యార్థులు, అధ్యాపకులు కలిసి తెలుగు భాషా సంస్కృతి, సాహిత్యంపై ప్రసంగాలు, వ్యాస రచన, కవితా పఠనం, భాషా క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. కార్యక్రమం చివర్లో, భాషా పరిరక్షణ, ప్రాచీన సంప్రదాయాల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

పోటీలలో గెలుపొందిన విద్యార్థులు

సెమిస్టర్ పరీక్షలలో  లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు

1.     కె. మౌనిక బి. యస్సీ (O గ్రేడ్ )

2.     వి. దేవి బి. ఏ. (O గ్రేడ్ )

వ్యాస రచన

మొదటి బహుమతి : కె. మౌనిక, బి. యస్సీ

రెండవ బహుమతి :ఎం,ఝాన్సీ రాణి, బి. ఏ.

 మూడవ బహుమతి  : హేమలత బి.యస్సీ

 

కవితా పఠనం

మొదటి బహుమతి : కె. మౌనిక, బి. యస్సీ

రెండవ బహుమతి : ఎస్. పవిత్ర, బి. కామ్

 మూడవ బహుమతి  : జి. మౌనిక, బి. యస్సీ

తెలుగు భాషా దినోత్సవం ద్వారా సాధించే ఫలితాలు(Outcome):

1. భాష పట్ల అవగాహన పెరుగుతుంది: ప్రజల్లో, ముఖ్యంగా యువతలో, తెలుగు భాషా ప్రాముఖ్యత,   చరిత్ర, సాహిత్య విలువలు గురించి అవగాహన పెరుగుతుంది.

2.     భాషా పరిరక్షణకు ప్రోత్సాహం: తెలుగు భాషను రక్షించుకోవడం, భవిష్యత్ తరాలకు తెలుగు భాషను పరిరక్షించి, సంక్షేమ భాషగా నిలుపుకోవడంలో సామాజిక చైతన్యం పెరుగుతుంది.

3.     సాహిత్య అభివృద్ధి: తెలుగు సాహిత్యంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. కవిత్వం, రచన, నాటకాలు వంటి కళలను ప్రోత్సహించడంతో సృజనాత్మకతకు వేదికగా నిలుస్తుంది.

4.     తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం ద్వారా భాషా ప్రాతినిధ్యం ద్వారా ప్రజలలో ఐక్యత, సంఘీభావం పెరుగుతుంది, భాషా ఆత్మగౌరవం పెంపొందుతుంది.

 https://docs.google.com/document/d/1EvumY3Hig6oJD6bOnegVVjrAOBQSobrL/edit?usp=sharing&ouid=114440381065676897972&rtpof=true&sd=true

































ధన్యవాదములు

నిర్వాహకులు

డా. జి. శ్రీనివాస రావు

తెలుగు విభాగం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల

 కామవరపుకోట




Comments

Post a Comment

Popular posts from this blog

Commerce - Profile

Department of Economics, Departmental Profile