Guest Lecture - Department of Telugu
అతిథి ఉపన్యాసం
స్థానిక కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు గారి సూచనల మేరకు కళాశాల విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నేడు ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు అధ్యక్షతన తెలుగు విభాగం ఆధ్వర్యంలో " గెస్ట్ లెక్చర్ " కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ కు చెందిన ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ కె రత్నశేఖర్ గారు సామాజిక సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు గారి జీవిత చరిత్ర మరియు గురజాడ కవిత్వం గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులంతా కలిసి రత్న శేఖర్ గారిని ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు, ఐ.క్యూ.ఎ.సి కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎం ఉషారాణి, కె ఇందిరా కుమారి ధారావతు మల్లేష్, ఎం విజయ కృష్ణ తో పాటు అధ్యాపకేతర సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.
https://gdckvkota.blogspot.com/2025/09/guest-lecture-department-of-telugu.html














Comments
Post a Comment