NSS Day Celebrations 2025
తేదీ: 24/09/2025
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు గారి సూచనల మేరకు కళాశాల విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నేడు “N.S.S డే” వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని కోరారు. అనంతరం కళాశాల ఎన్. ఎస్. ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.జి. శ్రీనివాస రావు జాతీయ సేవా పథకం యొక్క ఆవిర్భావం, లక్ష్యాలు, విధులు మరియు వాలంటీర్స్ చేయవలసిన వివిధ కార్యక్రమాల గురించి వివరించడంతో పాటు విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన పొస్టర్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు గారితో పాటు ఎన్ ఎస్ ఎస్ విభాగం కో-ఆర్డినేటర్ డాక్టర్ జి శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎం ఉషారాణి, కె.ఇందిరా కుమారి, ధారావతు మల్లేష్, బి రాజు, పి ఏడుకొండలు, ఎం విజయ కృష్ణ అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment