OZONE DAY CELEBRATIONS
తేది: 16/09/2025
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు గారి సూచనల మేరకు కళాశాల విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నేడు ఎన్ ఎస్ ఎస్ విభాగం మరియు కెమిస్ట్రీ విభాగముల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ "ఓజోన్ డే " కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వర రావు గారు ఓజోన్ పొర పరిరక్షణ ఆవశ్యకత గురించి వివరించారు.అనంతరం కెమిస్ట్రీ విభాగం అధ్యాపకురాలు ఎం ఉషారాణి గారు ఓజోన్ పొర విఘాతం వలన సకల జీవరాశికి కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అనంతరం సైన్స్ విద్యార్థులు ‘ఓజోన్ పొర” గురించి అవగాహన కల్పించే విధంగా పోస్టర్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు, ఎన్ ఎస్ ఎస్ విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ జి శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎం ఉషారాణి, కె ఇందిరా కుమారి, ధారావతు మల్లేష్, బి రాజు, ఎం విజయ కృష్ణ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment