GURAJADA JAYANTHI - DEPARTMENT OF TELUGU
గురజాడ జయంతి
స్థానిక కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు గారి సూచనల మేరకు కళాశాల విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో మహాకవి గురజాడ జయంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ కు చెందిన ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ కె రత్నశేఖర్ గారు గురజాడ రాసిన "కన్యాశుల్కం" తెలుగు నాటకరంగంలోనే కాకుండా, భారతీయ నాటక చరిత్రలోనూ ఒక మైలురాయి వంటిదని పేర్కొన్నారు . "దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్" అనే ఆయన మాట నేటికీ తెలుగు జాతికి మార్గదర్శక వాక్యమని కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రిన్సిపాల్ ఎం మల్లేశ్వరరావు, ఐ.క్యూ.ఎ.సి కో ఆర్డినేటర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎం ఉషారాణి, కె ఇందిరా కుమారి, ధారావతు మల్లేష్, ఎం విజయ కృష్ణ, బి రాజు తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment