గురజాడ అప్పారావు జయంతి వేడుకలు 2026


 గురజాడ అప్పారావు జయంతి నివేదిక

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామవరపుకోటలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో 21-09-2026న ప్రముఖ తెలుగు కవి, నాటక రచయిత, సామాజిక సంస్కర్త గురజాడ అప్పారావు గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా ఎం మధు గారు అధ్యక్షత వహించారు.ప్రారంభంలో గురజాడ అప్పారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.

తెలుగు అధ్యాపకులు డా జి. శ్రీనివాస రావు గురజాడ రచనలలో ప్రతిబింబించిన సామాజిక చైతన్యం, స్త్రీ విద్య, సమాజ సంస్కరణ, మూఢనమ్మకాల నిర్మూలన, వ్యావహారిక భాషా ఉద్యమం వంటి అంశాలను వివరించారు. విద్యార్థులు గురజాడ సాహిత్యం ద్వారా సమాజం పట్ల బాధ్యత, మానవతా విలువలు, సమానత్వ భావనలను అలవరచుకోవాలని సూచించారు.

 అనంతరం అధ్యాపకులు మరియు విద్యార్థులు గురజాడ అప్పారావు గారి జీవితం, సాహిత్య కృషి, సామాజిక సంస్కరణ భావాలు మరియు “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” అనే మానవతా సందేశం గురించి ప్రసంగించారు.

తెలుగు శాఖ తరఫున డా జి శ్రీనివాస రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు చురుకుగా పాల్గొని విజయవంతం చేశారు.

Aims / Objectives

గురజాడ అప్పారావు గారి జీవితం, సాహిత్య కృషిని విద్యార్థులకు పరిచయం చేయడం.

తెలుగు భాష, సాహిత్యం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడం.

గురజాడ రచనల్లోని సామాజిక సంస్కరణ భావాలను అవగాహన కల్పించడం.

విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించడం.






Comments

Popular posts from this blog

Department of Economics, Departmental Profile

Women Empowerment Cell,Aim , Objectives ,and Outcomes Activities