గుఱ్ఱం జాషువా జయంతి నివేదిక 2026

 గుఱ్ఱం జాషువా జయంతి నివేదిక 2026


తేది :28-09/2026

లక్ష్యాలు

  • గుఱ్ఱం జాషువా గారి జీవితం మరియు సాహిత్య కృషి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం.
  • జాషువా సాహిత్యంలో ప్రతిఫలించిన మానవతా విలువలను విద్యార్థులకు పరిచయం చేయడం.
  • సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం మరియు సోదరభావం పట్ల అవగాహన పెంపొందించడం.
  • తెలుగు సాహిత్యం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడం.
  • విద్యార్థుల్లో ప్రసంగ నైపుణ్యాలు మరియు భావవ్యక్తీకరణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం.
  • సామాజిక సమస్యలపై విద్యార్థుల్లో చైతన్యం మరియు బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించడం.

నివేదిక 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామవరపుకోటలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె విజయబాబు గారి సూచనల మేరకు కళాశాల విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తెలుగు శాఖ ఆధ్వర్యంలో గుఱ్ఱం జాషువా జయంతిని పురస్కరించుకుని 28-09-2026న కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో జాషువా జయంతి వేడుకలు నిర్వహించబడ్డాయి. 

ఇంచార్జ్ ప్రిన్సిపల్ డా. ఎం. మధు గారు మరియు అధ్యాపక సిబ్బంది ముందుగా జాషువా గారి చిత్రపటానికి పూలమాల తో ఘన నివాళి అర్పించడం జరిగింది. తదుపరి ఇంచార్జ్ప్ ప్రిన్సిపల్ గారు జాషువా గారి సాహిత్య సేవలను, సామాజిక చైతన్యాన్ని వివరించి, విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలుగు అధ్యాపకులు డా. జి. శ్రీనివాస రావు గారు జాషువా గారి జీవితం, రచనలు మరియు సాహిత్య విశిష్టతను వివరించారు ఈ సందర్భంగా గుఱ్ఱం జాషువా గారి జీవితం, సాహిత్య ప్రస్థానం, సామాజిక స్పృహ, సమానత్వ భావన మరియు మానవతా దృక్పథంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

 విద్యార్థులు జాషువా గారి సాహిత్యం, ఆయన రచనలలోని సామాజిక సందేశం మరియు సమాజంలో సమానత్వం యొక్క ఆవశ్యకతపై ప్రసంగాలు చేశారు.

ఫలితాలు / Outcomes

  • విద్యార్థులకు గుఱ్ఱం జాషువా గారి జీవితం, రచనలు మరియు సాహిత్య సేవలపై అవగాహన పెరిగింది.
  • జాషువా సాహిత్యంలో ఉన్న మానవతా, సమానత్వ మరియు సామాజిక చైతన్య సందేశాలను విద్యార్థులు అర్థం చేసుకున్నారు.
  • తెలుగు సాహిత్యం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది.
  • విద్యార్థులు స్వయంగా ప్రసంగాలు చేయడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం మరియు వక్తృత్వ నైపుణ్యాలు మెరుగుపడ్డాయి.
  • సామాజిక సమానత్వం, మానవ గౌరవం మరియు సోదరభావం వంటి విలువలపై విద్యార్థుల్లో అవగాహన పెరిగింది.
  • విద్యార్థుల్లో సామాజిక బాధ్యత మరియు మానవతా దృక్పథం పెంపొందించడానికి కార్యక్రమం దోహదపడింది.

ముగింపు

గుఱ్ఱం జాషువా జయంతి వేడుకలు విద్యార్థులకు తెలుగు సాహిత్యంపై, ముఖ్యంగా జాషువా గారి మానవతా మరియు సామాజిక చైతన్య సాహిత్యంపై విలువైన అవగాహనను కల్పించాయి. విద్యార్థుల ఉపన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

















Comments

Popular posts from this blog

Department of Economics, Departmental Profile

Women Empowerment Cell,Aim , Objectives ,and Outcomes Activities