Telugu - Gurajada Apparao Jayanthi
GURAJADA APPARAO JAYANTHI REPORT
Name of the activity : GURAJADA JAYANTHI
Department : Telugu
Date : 21-09-2024
No. of Staff
participated : 09
No. of Students
Participated : 70
Aim
To
commemorate the birth anniversary of Gurajada Appa Rao, a renowned Telugu poet
and freedom fighter, and to promote his literary contributions, ideals, and
legacy.
Objectives
1. Cultural
Preservation: To preserve and promote Telugu literature, culture, and heritage.
2. Literary
Awareness’:: To create awareness about Appa Rao’s literary works and their significance.
3. Inspiring
Youth: To inspire young generations to follow Appa Rao’s ideals and contribute
to society.
4. Community
Engagement : To foster community engagement through cultural events,
discussions, and debates.
5. Tribute
and Commemoration: To pay tribute to Appa Rao’s life, works, and contributions
to Indian independence.
Outcomes
1. Increased
awareness: Enhanced understanding of Appa Rao’s life, literary works, and
contributions.
2. Cultural
enrichment: Preservation and promotion of Telugu culture, literature, and
heritage.
3. Inspired
youth: Motivated young individuals to engage in literary pursuits and social
service.
4. Literary
revival: Renewed interest in Telugu literature and poetry.
గురజాడ అప్పారావు జయంతి వేడుక
లక్ష్యం(AIMS);
గురజాడ
అప్పారావు జయంతి వేడుకల ముఖ్య ఉద్దేశ్యం ఆయన సాహిత్య, సామాజిక మరియు సాంస్కృతిక
కృషిని గుర్తు చేసుకోవడం. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో కొత్తదనం
తీసుకువచ్చిన ప్రముఖ కవి, రచయిత, మరియు సామాజిక సంస్కర్త. ఆయన రాసిన కన్యాశుల్కం
నాటకం ఆ సమయంలో సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించింది. జయంతి వేడుకలలో ఆయన రచనలపై
చర్చలు, పుస్తక ప్రదర్శనలు, నాటకాలు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం
ద్వారా యువతకు ఆయన అందించిన సాహిత్య స్ఫూర్తిని పరిచయం చేస్తారు.
గురజాడ అప్పారావు జయంతి వేడుక
ఉద్దేశ్యం(OBJECTIVES) :
గురజాడ
అప్పారావు జయంతి వేడుకల ప్రధాన ఉద్దేశ్యం ఆయన సాహిత్య, సామాజిక మరియు సాంస్కృతిక
సేవలను గుర్తుచేసుకుంటూ, తరం నుండి తరానికి అందించడమే. గురజాడ అప్పారావు తన రచనల
ద్వారా సామాజిక చైతన్యాన్ని, సమానత్వాన్ని, మరియు మహిళా హక్కుల పట్ల అవగాహన
కల్పించారు. కన్యాశుల్కం వంటి సాహిత్య కృతుల ద్వారా మన సమాజంలో మార్పుకు కావలసిన
సందేశాలను అందించారు. వేడుకల
ద్వారా యువతకు ఆయన భావాలను, ఆలోచనలను చేరవేసి, సమాజంలో మానవతా విలువలను
పెంపొందించడమే ఈ ఉద్దేశ్యం.
ఈ రోజు కళాశాలలో ప్రముఖ తెలుగు కవి, రచయిత, సంఘసంస్కర్త
శ్రీ గురజాడ వెంకట అప్పారావు గారి జయంతిని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా
నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో గురజాడ గారి సాహిత్య, సంఘ సేవలను స్మరించుకుంటూ, యువతకు
ప్రేరణ కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాము.
కార్యక్రమ ఆరంభంలో సభాద్యక్షులు మరియు అధ్యాపకులు
గురజాడ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘననివాళులు అర్పించారు. అనంతరం,
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా. జి. శ్రీనివాస
రావు గురజాడ సాహిత్య విశిష్టత, సామాజిక
బాధ్యతపై ఆయన రచనల ప్రభావాన్ని గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు గురజాడ గారి ప్రసిద్ధ రచన “కన్యాశుల్కం” నుండి ప్రదర్శనలు చేపట్టారు. అలాగే, “దేశముంటే
మట్టి కాదోయి, దేశమంటే మనుషులోయి” వంటి ప్రముఖ కవితల ద్వారా,
గురజాడ గారి భావాలను ప్రసిద్ధమయ్యేలా చేశారు.
సొంత
పని పక్కన పెట్టి, సమాజం కోసం పనిచేయాలన్న గురజాడ యొక్క
సందేశాన్ని గుర్తుచేస్తూ, ముఖ్య అతిథులు సమాజ సేవలో విద్యార్థుల పాత్రను
ఉద్ఘాటించారు. రచయిత గురజాడ గారి సమాజంలో మార్పులు తీసుకువచ్చిన సామాజిక
సంఘసంస్కరణలు, ఆయన కాలానికి మించిన దూరదృష్టి విశేషంగా చర్చించబడ్డాయి.
విద్యార్థుల మధ్య కవితా పఠనం, వ్యాస రచన, గురజాడ గారి
రచనలపై వ్యాస పోటీలు నిర్వహించబడ్డాయి. పోటీల విజేతలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమ ముగింపులో గురజాడ వెంకట అప్పారావు గారి
సాహిత్యాన్ని, ఆయన జీవితాన్ని మరింతగా అధ్యయనం చేయాలని, ఆయన మార్గదర్శక సూత్రాలను
ఆచరణలో పెట్టాలని ప్రతి ఒక్కరూ సంకల్పం చేయడం జరిగింది.
గురజాడ అప్పారావు జయంతి వేడుక ఫలితం(OUTCOMES):
గురజాడ అప్పారావు జయంతి వేడుకల ఫలితంగా, ఆయన
సాహిత్య, సామాజిక, మరియు సాంస్కృతిక సేవలను
విద్యార్థులు, సమాజం మరింతగా అర్థం
చేసుకుంటుంది. ముఖ్యంగా, తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన మార్పులు, సామాజిక సమస్యలపై
ఆయన చూపిన దృష్టి యువతలో చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ వేడుకల ద్వారా యువత ఆయన
రచనల ప్రాముఖ్యతను, అందులో ఉన్న సామాజిక సందేశాలను తెలుసుకుని, మన సమాజంలో
సమానత్వం, మానవత్వం వంటి విలువలను అలవర్చుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాక, గురజాడ సాహిత్య
ప్రేరణతో మరింత సృజనాత్మక రచనలు వెలువడేందుకు ప్రోత్సాహం లభిస్తుంది.
ధన్యవాదములు
నిర్వాహకులు
డా. జి. శ్రీనివాస రావు
తెలుగు విభాగం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కామవరపుకోట
Comments
Post a Comment